చర్చిల వివాదం, సింహాచలంలో హిందూసేన వీరంగం

పరిరక్షణ సమితి అధ్యక్షుడు కమలాకుమార్ దేవస్థానం సర్వే నంబర్ 275లో అక్రమంగా వెలసిన చర్చిలను తొలగించాలని ఆయనను కోరారు. అలాగే గోసంరక్షణపై పర్యవేక్షణ కొరవడిందని, ఆడిట్‌లో అవకతవకలు తదితర వాటిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. ఈఓ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిరక్షణ సమితి సభ్యులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అనంతరం జెండాలతో దర్శనానికి వెళ్లేందుకు యత్నించగా, దేవస్థానం ఉద్యోగులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఇంతలో కాకినాడకు చెందిన సత్యనారాయణమూర్తి అనే సభ్యుడు ఈఓపైకి దూసుకురావడంతో దేవస్థానం సిబ్బంది, స్క్వాడ్ సిబ్బంది వారిపై దాడికి దిగారు. కొందరు ఉద్యోగులు కర్రలతో వారిని తరిమారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది.
ఈ వివాదంలో కొందరు సభ్యులకు గాయాలయ్యాయి. దీనిపై ఈఓ గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, దేవస్థానం ఎస్‌పిఎఫ్‌సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈఓపైకి దూసుకెళ్లిన సత్యనారాయణమూర్తిని అదుపులో తీసుకున్నారు.












Click it and Unblock the Notifications