తెలంగాణపై త్వరలో మొయిలీ ప్రకటన: కెకె

తెలంగాణకు అనుకూలంగా ఢిల్లీలో పరిస్థితులు మారాయని పసిగట్టిన సీమాంధ్ర కాంగ్రెసు నేతలు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింట్ మెంటు కోరారు. అయితే ఆమె అందుకు నిరాకరించారు. కాగా, వీరప్ప మొయిలీ మంగళవారమే ప్రకటన చేసే ఆవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన పార్టీ పరంగా ప్రకటన చేస్తారా, ప్రభుత్వం తరఫున ప్రకటన చేస్తారా అనేది తెలియడం లేదు. తెలంగాణపై న్యాయనిపుణుల కమిటీ వేస్తారని భావిస్తున్న తరుణంలో ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ప్రకటన చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు. ఇదిలా వుంటే, కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం సాయంత్రం రాష్ట్రానికి చెందిన ముఖ్యనేతలతో సమావేశమవుతున్నట్లు సమాచారం. రాష్ట్ర కాంగ్రెసు నాయకులకు ఆమె స్పష్టమైన సందేశం ఇచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications