ఐపియల్ మ్యాచులను అడ్డుకోం: కోదండరామ్

JAC
హైదరాబాద్: హైదరాబాదులో ఐపియల్ మ్యాచులను అడ్డుకోబోమని రాజకీయ, ప్రజా సంఘాల జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ఈ విషయమై తాము ఐపియల్ కమిషనర్ లలిత్ మోడీకి లేఖ కూడా రాస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. హైదరాబాదులో అశాంతి పరిస్థితులున్నాయనే ప్రచారంలో నిజం లేదని, హైదరాబాదు ప్రశాంతంగానే ఉందని ఆయన అన్నారు. తాము గాంధేయ పద్ధతిలో శాంతియుత మార్గంలో మాత్రమే ఆందోళనలు చేస్తున్నామని, ఇవి ప్రశాంత వాతావరణాన్ని భగ్నం చేసేవి కావని ఆయన అన్నారు.

తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఐపియల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ముంబైకి మార్చినట్లు లలిత్ మోడీ ఇది వరకే ప్రకటించారు. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో తెలంగాణ ఆందోళనకారులు ఈ నెల 12వ తేదీన క్రికెట్ మ్యాచును అడ్డుకున్న నేపథ్యంలో ఐపియల్ ఆ నిర్ణయం తీసుకుంది. ఈ స్థితిలో దక్కన్ చార్జర్స్ తో జరిగే మ్యాచులు హైదరాబాదులో జరిగే పరిస్థితిపై కూడా అనుమానాలు మొదలయ్యాయి. హైదరాబాదులో జరగాల్సిన మ్యాచులను ఇతర ప్రాంతాలకు తరలిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ పరిస్థితిలో కోదండరామ్ ఆ ప్రకటన చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+