తేడా వస్తే పోరాడుదాం: సమైక్య నేతలు

అందరినీ కలిపింది తెలుగు భాషేనని, అందరం కలిసి ఉండడానికి పొట్టి శ్రీరాములు, పుచ్చలపల్లి సుందరయ్య, ఎన్టీఆర్, వైయస్సార్ స్ఫూర్తితో పని చేద్దామని కాంగ్రెసు నేత లగడపాటి రాజగోపాల్ అన్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని సహించబోమని ఆయన హెచ్చరించారు. అన్ని ప్రాంతాలు కలిసి ఉండడానికి కారణాలు చెప్పమంటున్నారని, తాను లక్ష కారణాలు చెబుతానని ఆయన అన్నారు. హైదరాబాదులో ఆంధ్రా హోటళ్లు మూయిస్తారా, కెసిఆర్ ను అడిగి అనుమతులు తీసుకోవాలా, ఆంధ్ర ఎవరి సొత్తో కాదని ఆయన అన్నారు. తాము ఎన్నికల్లో కెసిఆర్ తో పొత్తు పెట్టుకుని ఓడిపోయామని, ఆయన స్వయంగా ఓడిపోయారని, అప్పటి నుంచే డ్రామాలు మొదలయ్యాయని దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తెలంగాణ కావాలని అంటున్నారని తెలుగుదేశం నాయకుడు కోడెల శివప్రసాద రావు చెప్పారు.












Click it and Unblock the Notifications
