న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీ ఇరు పక్షాలకు ఆమోదయోగ్యంగా ఉందని కాంగ్రెసు కోస్తాంధ్ర పార్లమెంటు సభ్యుడు కావూరి సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలో ఇకపై ఆందోళనలు, నిరసనలు అక్కరలేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణాన్ని కల్పిస్తే కమిటీ తన పని తాను చేసుకుంటుందని ఆయన అన్నారు.
అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల అభిప్రాయాలు తీసుకోవాలన్న తమ విజ్ఞప్తి మేరకే కమిటీ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అయితే తాము దీన్ని తమ విజయంగా భావించడం లేదని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి