8న శ్రీకృష్ణ కమిటీ తొలి సమావేశం

Srikrishna
న్యూఢిల్లీ: జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ సంప్రదింపుల కమిటీ తొలి సమావేశం ఈ నెల 8వ తేదీన జరుగుతుంది. ఈ నెల 8వ తేదీ తర్వాత కమిటీ సభ్యులు రాష్ట్రంలో పర్యటించి అభిప్రాయాలు సేకరిస్తారని తెలుస్తోంది. కాగా, కమిటీ విధివిధానాలను రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. కమిటీ చైర్మన్ శ్రీకృష్ణతో చర్చించిన తర్వాత విధివిధానాలను ఖరారు చేయనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీని వేసినందున రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కోరారు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా విద్యార్థులు ఆందోళనలు విరమించాలని, కళాశాలలకు వెళ్తూ పరీక్షలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. పరిపాలన సజావుగా సాగకపోతే అభివృద్ధి కుంటుపడుతుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితులపై కమిటీని ప్రకటించిన తర్వాత ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+