కడప: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి మరణవార్త విని ఎంతోమంది అభిమానులు ప్రాణాలొదిలారని ఎంపి జగన్మోహన రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏప్రిల్ రెండవ వారం నుంచి రాష్ట్రమంతటా పర్యటించి, ప్రాణత్యాగం చేసినవారి కుటుంబాలను పరామర్శిస్తానని ఆయన చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి భారీ కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రి సాయిప్రతాప్ ఈరోజు ఉదయం ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ తన తండ్రి చేసిన సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయారన్నారు. ఈరోజు ప్రతి ఇంట్లోనూ అయన ఫొటో ఉందన్నారు. అటువంటి మహానుభావునికి కొడుకుగా జన్మించడం తన అదృష్టం అని జగన్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు గల్లా అరుణ, అహ్మదుల్లా, ఎమ్మెల్సీ వైయస్ వివేకానందరెడ్డి, జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ జ్యోతిరెడ్డి, నగర మేయర్ రవీంద్రనాథ్ తదితరులు ప్రసంగించారు.మహానేతకు అందరూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి