హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ ముస్లిం గర్జన ఆదివారం నిజాం కళాశాలలో జరుగుతోంది. జమతే హిందూ సంస్థ ఆధ్వరంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్ ప్రోఫెసర్ కోదండరాం, ప్రజాయుద్ధ నౌక గద్ధర్ హాజరయ్యారు. ఈ సభకు తెలంగాణ నుంచి ముస్లిములు వేలాదిగా తరలివచ్చారు. ఈ సభలో గద్ధర్ పాటలు పాడి ఆహూతులను ఉత్సాహపరిచారు. ఈ సభకు వేలాదిమంది ముస్లీం మహిళలు హాజరుకావడంపై తెలంగాణ నాయకులు ఆనందం వ్యక్తంచేశారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి