వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనుమానమొస్తే ఆగేది లేదు: చంద్రశేఖరరావు

By Santaram
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్‌: చాలా రోజుల తర్వాత టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు సీమాంధ్ర నేతలపై నిప్పులు చెరిగారు. ''సమైక్యవాదంతో సీమాంధ్ర నాయకులు చేస్తున్న ఆందోళన అసలు ఉద్యమమే కాదు. అసలు సమైక్యవాదానికి నీతీ జాతీ ఉందా? ఇప్పుడు సమైక్యవాదమంటూ మాట్లాడుతున్న విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌, తెలుగుదేశం పార్టీ సీమాంధ్ర నేతలు... వారి పార్టీలు ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు అనుకూలమంటూ ప్రకటించినపుడు, పార్టీల అత్యున్నత కమిటీల్లో చర్చించినపుడు, ఎన్నికల మేనిఫెస్టోల్లో చేర్చినపుడు ఎందుకు ప్రశ్నించలేదు? సమైక్యవాదంపై వారికి నిజాయితీ ఉంటే పార్టీలు మేనిఫెస్టోల్లో పెట్టినపుడే రాజీనామాలు చేయాల్సింది. ఆనాడు ఎన్నికల కోసం ప్రజలను ఫూల్‌ చేసినట్టేనా?'' అని తెరాస అధినేత కేసీఆర్‌ నిలదీశారు.

మాజీ ఉప ముఖ్యమంత్రి కొండా వెంకట రంగారెడ్డి జీవిత చరిత్ర ఆంగ్ల అనువాద పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారమిక్కడ ఏవీ కళాశాలలో జరిగింది. దీనికి హాజరైన కేసీఆర్‌ మాట్లాడుతూ పార్టీలు, కొందరు నేతల వైఖరి చూస్తుంటే.. ఇంత మోసమా.. ఇంత దగానా అని అనిపిస్తోందన్నారు. జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల్లో తేడాలుంటే రాజీనామాలు చేయాల్సిందేనని, ఒకవేళ రాజీనామా చేయకపోతే ప్రజలే చూసుకుంటారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్దేశించినది కాదని అణువంత అనుమానం కలిగినా తక్షణం రాజీనామా చేద్దామన్నారు. కాలపరిమితితో.. తెలంగాణ ఏర్పాటు దిశగానే కమిటీ ఉంటుందని ఆశిద్దామని, కమిటీ విధివిధానాల్ని పరిశీలించిన తర్వాత అది కేవలం కాలయాపనకు పనిచేసే కమిటీ అని తేలితే తానే మొదట రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేసినట్లు సీమాంధ్రకు చెందిన కొందరు వింతవాదన చేస్తున్నారని, భౌగోళిక విస్తరణ అభివృద్ధి కాదన్నారు. హైదరాబాద్‌పై చేస్తున్న వితండవాదన పక్కనపెట్టాలని, ఒకవేళ దీన్ని అలాగే కొనసాగిస్తే తాము కూడా విశాఖపట్నం, తిరుపతిలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కోరతామని చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X