హైదరాబాద్: హైదరాబాద్‌లో సీమాంధ్రవాసులు 40 లక్షల మంది ఉన్నారన్న దానిలో వాస్తవంలేదని, నాలుగు లక్షల మందిని మించిలేరని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు చెప్పారు. ఒక పూస్తకావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అన్నది తమ సమస్యకాదని, అదివారి సమస్య అని వ్యాఖ్యానించారు.కాలపరిమితితో.. తెలంగాణ ఏర్పాటు దిశగానే కమిటీ ఉంటుందని ఆశిద్దామని, కమిటీ విధివిధానాల్ని పరిశీలించిన తర్వాత అది కేవలం కాలయాపనకు పనిచేసే కమిటీ అని తేలితే తానే మొదట రాజీనామా చేస్తానని స్పష్టంచేశారు. హైదరాబాద్‌ను తామే అభివృద్ది చేసినట్లు సీమాంధ్రకు చెందిన కొందరు వింతవాదన చేస్తున్నారని, భౌగోళిక విస్తరణ అభివృద్ధి కాదన్నారు. హైదరాబాద్‌పై చేస్తున్న వితండవాదన పక్కనపెట్టాలని, ఒకవేళ దీన్ని అలాగే కొనసాగిస్తే తాము కూడా విశాఖపట్నం, తిరుపతిలను కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలని కోరతామని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి