నెల్లూరు: నెల్లూరు జిల్లా నాయుడుపేటలో గ్లాస్ తయారీ కేంద్రం ఏర్పాటుకు హిందుస్థాన్ నేషనల్ గ్లాస్ కంపెనీ ముందుకొచ్చింది. వెయ్యికోట్ల పెట్టుబడితో గ్లాస్ ప్లాంట్‌ను ఏప్రిల్‌లో స్థాపించాలని కంపెనీ నిర్ణయించింది. ప్రభుత్వ పరంగా అన్నివిధాల సాయం అందిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య కంపెనీ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
తొలివిడతగా రూ.480 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. రోజుకు 600 టన్నుల గ్లాస్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. 2012 నాటికి ప్లాంట్ నిర్మాణం పూర్తికానుందని చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి