కృష్ణాజిల్లా అభివృద్ధిపై 16 న సిఎం సమీక్ష

రాజధానిలో జరిగే సీఎం సమీక్షకు జిల్లా మంత్రి కేపీ సారథి, ఇన్‌చార్జిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, శాసన సభ్యులు, కలెక్టరు హాజరవుతారు. ప్రగతి నివేదికలపై సీఎం ఏవైనా సందేహాలు వ్యక్తం చేస్తే వెంటనే నివృత్తి చేయడానికి వీలుగా విజయవాడలోని వీడియో కాన్ఫరెన్స్‌హాలులో జిల్లా అధికారులను అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే కలెక్టర్ రోజుకో ప్రభుత్వశాఖను సమీక్షిస్తూ నోట్స్ తయారు చేస్తున్నారు. దాదాపు అన్ని శాఖల ప్రగతి, ఎదురవుతున్న సమస్యలపై పూర్తిగా అవగాహన పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications