రూర్కెలా: రూర్కెలా సమీపంలో మావోయిస్టులు సోమవారం తెల్లవారు జామున రైల్వే ట్రాక్ ను పేల్చేశారు. దీంతో హౌరా - ముంబై మార్గంలో పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. రూర్కెలాకు 30 కిలోమీటర్ల దూరంలో గల భలులతా, జెరైకేలాల మధ్య మావోయిస్టులు రైల్వే ట్రాక్ ను పేల్చేశారు. దీంతో పలు రైళ్లు ఆగిపోయాయని రూర్కెలా స్టేషన్ మేనేజర్ ఎస్కె పాండా చెప్పారు.
సంఘటనలో ప్రాణాపాయం సంభవించినట్లు సమాచారం లేదు. పేలుడు పదార్థాలను ఈ మార్గంలో ఆ పైన కూడా పెట్టి ఉంటారని పాండా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మావోయిస్టులు బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో శనివారంనాటి నుంచి 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు. తమపై కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్ హంట్ కు నిరసనగా మావోయిస్టులు ఈ బంద్ ను తలపెట్టారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి