హైదరాబాద్: ముస్లిం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టివేయడాన్ని నిరసిస్తూ మజ్లీస్ సోమవారం సచివాలయ ముట్టడికి పూనుకుంది. అనూహ్యంగా మజ్లీస్ కార్యకర్తలు సచివాలయం వద్దకు దూసుకొచ్చారు. సచివాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ధర్నా కార్యక్రమంలో మజ్లీస్ శాసనసభ్యులు అక్బరుద్దీన్ ఓవైసి, పాషా ఖాద్రి కూడా పాల్గొన్నారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు.
విద్యఉద్యోగాల్లో ముస్లింలకు కేటాయించిన నాలుగు శాతం రిజర్వేషన్లను హైకోర్టు కొట్టేయడంపై ముఖ్యమంత్రి కె. రోశయ్య ప్రతిస్పందించారు. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేయాలని ఆయన అడ్వొకేట్ జనరల్ కు సూచించారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి