వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ప్రకటనలో జాప్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

GK Pillai
న్యూఢిల్లీ: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాల ప్రటనలో జాప్యం జరిగే అవకాశం ఉంది. కాంగ్రెసు కోర్ కమిటీలో చర్చించిన తర్వాతనే కమిటీ విధివిధానాలు వెల్లడవుతాయని కేంద్ర హోం శాఖ కార్యదర్శి పిళ్లై చెప్పారు. కాగా, కాంగ్రెసు కోర్ కమిటీ సోమవారం సాయంత్రం సమావేశమయ్యే అవకాశం ఉంది. కమిటీ విధివిధానాలు సోమవారం మధ్యాహ్నం 12 గంటలకే వెల్లడవుతాయని భావించారు.కానీ కోర్ కమిటిలో చర్చించిన తర్వాతనే ప్రకటన చేయాలని నిర్ణయం జరగడుంతో అది వాయిదా పడింది.

కాగా, జస్టిస్ శ్రీకృష్ణ కమిటి విధివిధానాలు ఖరారయ్యాయి. రాష్ట్రపరిస్థితిపై సంప్రదింపుల కమిటి విధివిధానాలపై సోమవారం నాడు హోం మంత్రి చిదంబరం ఉన్నతస్థాయి అధికారులతో సమావేశమై తుది కసరత్తు జరిపారు. సమావేశానంతరం హోం శాఖ కార్యదర్శి పిళ్ళై విలేఖర్లతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. కమిటి విధివిధానాలు ఖారరయ్యాయని ఆయన వెల్లడించారు. అయితే కాంగ్రెస్ కోర్‌కమిటి సమావేశం తర్వాత ప్రకటన ఉండవచ్చని ఆయన చెప్పారు. కమిటి కాలపరిమితిని ఏడాదిలోపు ఉండవచ్చునని సూచనప్రాయంగా తెలిపారు. కాలపరిమితి ఏడాదిలోపేనని నిర్దేశించినా, కమిటి విచారణకు సమయం సరిపోకపోతే పొడిగింపు ఉండవచ్చునని ఆయన తెలిపారు. మొత్తానికి అందరికీ ఆమోదయోగ్యమైన ప్రకటన వస్తుందని హోం శాఖ కార్యదర్శి పిళ్ళై వివరించారు.

విధివిధానాలు ఖరారయ్యాయని తెలిసి ఆంధ్రప్రదేశ్ నాయకులు వాటిపై ఆరా తీయడం ప్రారంభించారు. విధివిధానాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కోర్ కమిటీ సమావేశం తర్వాత విధివిధానాలపై ప్రకటన చేయాలని కాంగ్రెసు నాయకత్వం అనుకుంటోంది. ఒకవేళ కోర్‌కమిటి సమావేశం కాకపోతే చిదంబరం విధివిధానాల ముసాయిదాతో ప్రధాని, సోనియాను కలిసి ఆమోదం తీసుకుని ప్రకటన చేయవచ్చనే ప్రచారం కూడా జరుగుతోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X