తెలంగాణ కమిటీపై కోర్ కమిటీ భేటీ

అదే సమయంలో రేపటి కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను ఉంచనున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ప్రతి శుక్రవారం కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశమవుతుంది. ఏదైనా అత్యవసరమైన అంశం చర్చించాల్సి వస్తే మాత్రమే ఇతర రోజుల్లో సమావేశమవుతుంది. బుధవారం సమావేశం కావడానికి కమిటీ విధివిధానాల విషయంలో పెరుగుతున్న ఒత్తిడే కారణమని భావిస్తున్నారు. బుధవారం జరిగే కోర్ కమిటీ సమావేశంలో పెట్రోల్ ధరలపై కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే నిత్యావసర ధరలపై చర్చించవచ్చు. కోర్ కమిటీ తర్వాత శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలను చిదంబరం వెల్లడిస్తారా, ఇంకా జాప్యం చేస్తారా అనేది తెలియడం లేదు. కాగా, శ్రీకృష్ణ కమిటీ సమావేశం ఈ నెల 13వ తేదీన జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications