బాబూ! నువ్వేం చేశావు?: రఘువీరా

Raghuveera Reddy
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్ర భద్రతా సలహాదారు కెవిపి రామచందర్ రావుపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చంద్రబాబుపై తీవ్రంగా విరుచుకు పడ్డారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఏ రోజు కూడా బాధ్యతగా వ్యవహరించలేదని, వ్యక్తులను లక్ష్యం చేసుకుని పని చేస్తున్నారని ఆయన అన్నారు. కెవిపి రామచందర్ రావు రాసిన లేఖకు సమాధానం ఇవ్వాలని ఆయన చంద్రబాబును డిమాండ్ చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన ఇందిరా గాంధీని చంద్రబాబు విమర్శిస్తున్నారని, శాసనసభ్యుడిని, మంత్రిని చేసిన ఇందిరా గాంధీని చంద్రబాబు విమర్సించడం సరి కాదని ఆయన అన్నారు.

తనపై విమర్శలు వస్తే చంద్రబాబు కనీసం విచారణకు కూడా అంగీకరించలేదని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెసుకు కెవిపి పిల్లర్ లాంటివాడని, సలహాదారు ఎలా ఉండాలో కెవిపి నిరూపించారని, ఇప్పటి వరకు చంద్రబాబుపై కెవిపి ఏ విధమైన విమర్శలు చేయలేదని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని పడగొట్టే లక్ష్యంతో చంద్రబాబు పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెసు పార్టీని చంద్రబాబు ఎన్నికల్లో ఎదుర్కోవాలని, ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు రావు కదా అని ఆయన అన్నారు. అసత్యాలతో చంద్రబాబు తమను ఏమీ చేయలేరని, చంద్రబాబు ఆరోపణలకు బెదిరిపోయే వ్యక్తులు కాంగ్రెసులో ఎవరూ లేరని ఆయన అన్నారు. ఏమైనా అంటే హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటారని ఆయన అన్నారు. మీ మామకు మీరు చేసిందేమిటి, సలహాదారుగా మీరు ఏం చేశారో అది రుజువు కాదా అని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+