కె చంద్రశేఖర రావుతో చేతులు కలిపిన కాంగ్రెసు నేతలు

Kesava Rao-K Chandrasekhar Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కాంగ్రెసు తెలంగాణ నాయకులు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో చేతులు కలిపారు. తెలంగాణ సాధన కోసం కాంగ్రెసు, తెరాస కలిసి ఉమ్మడి వ్యూహం రచించాయి. బుధవారం సాయంత్రం తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో సహా కాంగ్రెసు నాయకులు కె కేశవరావు నివాసంలో సమావేశమై వ్యూహ రచన చేశారు. తొలుత కెసిఆర్ తో సమావేశమైన కాంగ్రెసు నాయకులు దామోదర్ రెడ్డి తదితరులు ఆ తర్వాత కెసిఆర్ తో కలిసి కేశవరావు నివాసానికి వెళ్లారు. అక్కడ తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు.

జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలు తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఎంతటి త్యాగాలకైనా వెనకాడవద్దని నిర్ణయించుకున్నారు. రాష్ట్రపతి పాలన వచ్చినా సరే వెనకాడవద్దని నిర్ణయించుకున్నారు. విధివిధానాలు నచ్చకుంటే శాసనసభకు గైర్హాజరు కావాలని కూడా అనుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని ఇప్పటి వరకు ప్రజలు ముందుకు నడిపించారని, ఇప్పడు మనం నడిపిద్దామని అనుకున్నారు. విధివిధానాల విషయంలోనే కాకుండా కాలపరిమితి విషయంలో కూడా పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని కేంద్రం నిర్దిష్టమైన, స్పష్టమైన ప్రకటన చేసే వారకు పోరాటం సాగించాలని నిర్ణయించుకున్నారు.

తెలంగాణ కోసం కఠిన నిర్ణయాలకు వెనకాడేది లేదని తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు సమావేశానంతరం మీడియా ప్రతినిధులతో చెప్పారు. తాము ఏం చేస్తామనేది ఇప్పుడే చెప్పబోమని ఆయన అన్నారు. విధివిధానాలు, కాల పరిమితి తెలంగాణకు అనుకూలంగా లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకోవాలనే అంశంపై అన్ని కోణాల్లో చర్చించామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+