హైదరాబాద్ : రాజ్యాంగానికి లోబడే రాజీనామాలపై స్పందిస్తామని శాసనసభా సభాపతి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని స్పీకర్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సింది ప్రతిపక్షాలేనని సభాపతి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శాససనసభలో ప్రజా సమస్యలను ప్రస్తావించాల్సింది ప్రతిపక్షాలేనని సభాపతి అన్నారు. బడ్జెట్ సమావేశాలు సందర్బంగా సభా 30, 31 రోజులపాటు జరుగుతుందని, అసెంబ్లీ కవరేజీ విషయంలో మీడియా సంయమనం పాటించాలి, అసెంబ్లీలోపల జరిగేది మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయాలని, మీడియా పాయింట్, లాబీల్లో రికార్డు మాత్రమే జరగాలని ఆయన చెప్పారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి