హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్టానం పిలుపు మేరకు ఆయన ఈరోజు ఉదయం పది గంటలకు హస్తినకు పయనం అవుతున్నారు. శ్రీకృష్ణ కమిటీ విధివిధానాలకు నిరసనగా దామోదర్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అలాగే మరో ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు.
వీరికి కాంగ్రెస్ హైకమాండ్ కొన్ని విషయాలు చెప్పి రాజీనామాలను ఉపసంహరించుకోమని కోరవచ్చు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని ఈ సమయంలో రచ్చ చేసుకోవద్దని వీరప్ప మొయిలీ వీరికి చెప్పవచ్చు.