హైదరాబాద్: హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నిస్సార్ అహ్మద్ కక్రూ శుక్రవారం ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కక్రూతో ప్రమాణం స్వీకారం చేయించారు. కక్రూ ఇంతకు ముందు జమ్మా కాశ్మీర్ న్యాయమూర్తిగా పనిచేశారు. శుక్రవారం ఉదయం పది గంటలకు కక్రూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు.
కక్రూ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె. రోశయ్య, అధికారులు హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు హాజరయ్యారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి