Visakhapatnam – Kollam: విశాఖ-కేరళ కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్-షెడ్యూల్, స్టాప్ లు ఇవే..!
ఏపీలోని విశాఖపట్నం నుంచి కేరళలోని కొల్లంకు దక్షిణ మధ్య రైల్వే కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ (Visakhapatnam-Kollam Weekly Express)ను ప్రారంభిస్తోంది. ఇప్పటికే ఏపీ, కేరళ మధ్య పలు రైళ్లు నడుస్తుండగా.. వాటిలో రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. విశాఖ నుంచి కొల్లం మధ్య రాకపోకలు సాగించేలా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభిస్తున్న రైల్వే.. ఈ రైలు మార్గం, స్టాప్ లు, ఇతర వివరాలను కూడా వెల్లడించింది. అవేంటో ఓసారి చూసేద్దాం..
విశాఖపట్నం నుంచి కొల్లంకు ప్రతీ మంగళవారం నడిచేలా కొత్త వీక్లీ ఎక్స్ ప్రెస్ నంబర్ 18501ను ఈ నెల 12న ప్రారంభిస్తున్నారు. అలాగే కొల్లం నుంచి విశాఖకు ప్రతీ బుధవారం నడిచేలా మరో ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18502 ను ఈ నెల 13న ప్రారంభిస్తున్నారు. ఈ రెండు రైళ్లలోనూ ఒక సెకండ్ ఏసీ, ఐదు ధర్డ్ ఏసీ, ఆరు స్లీపర్, నాలుగు జనరల్ బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు.

🚆 New Weekly Connectivity Alert!
— Vijayawada Division (@drmvijayawada) May 7, 2026
🔹 Train No. 18501 Visakhapatnam–Kollam Weekly Express
🗓️ Every Tuesday
📅 Effective from 12th May 2026
🔹 Train No. 18502 Kollam–Visakhapatnam Weekly Express
🗓️ Every Wednesday
📅 Effective from 13th May 2026@SCRailwayIndia @RailMinIndia pic.twitter.com/Mmhnqj3ZmT
విశాఖలో మంగళవారం ఉదయం 8.20కు బయలుదేరే ఎక్స్ ప్రెస్ రైలు దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లి గూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా తమిళనాడులోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి కేరళలోని కొల్లంకు బుధవారం మధ్యాహ్నం 2.50కు చేరుకుంటుంది. అలాగే కొల్లం నుంచి బుధవారం సాయంత్రం 5.20కు బయలుదేరే రైలు ఇవే స్టేషన్ల మీదుగా తిరిగి విశాఖకు గురువారం రాత్రి 11 గంటలకు చేరుకుంటుంది.














Click it and Unblock the Notifications