Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !!

Visakhapatnam- Divya Dakshin tourist special train: విశాఖపట్నం నుంచి దివ్య దక్షిణ యాత్ర పేరుతో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ మరో టూర్ ప్యాకేజీని ప్రకటించింది. అరుణాచలం- కాంచీపురం- మహాబలిపురం- రామేశ్వరం- మధురై వంటి పుణ్య క్షేత్రాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆయా పుణ్యక్షేత్రాలను భక్తులు దర్శించుకోవచ్చు. ఏడు రాత్రులు/ ఎనిమిది పగళ్లు సాగే యాత్రా స్పెషల్ ఇది.

ఈ నెల 27వ తేదీన విశాఖపట్నం నుండి ఈ భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరి వెళ్తుంది. మొత్తం 790 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఉండేవన్నీ కూడా స్లీపర్ కోచ్ లే. ఏసీ బోగీలు ఉండవు. విశాఖపట్నం నుంచి బయలుదేరే ఈ ఎక్స్‌ప్రెస్ కు తుని, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్‌లల్లో హాల్ట్ సౌకర్యం ఉంది. ఆయా స్టేషన్లల్లో ప్రయాణికులు బోర్డింగ్/డీబోర్డింగ్ అవ్వొచ్చు.

IRCTC run Divya Dakshin Yatra with Arunachalam and Kanchipuram by Bharat Gaurav from Visakhapatnam

తొలుత కాంచీపురంలో వెలిసిన కామాక్షి అమ్మవారిని దర్శించుకోవడంతో ఈ యాత్ర మొదలవుతుంది. అక్కడే ఏకాంబరేశ్వర ఆలయం, శ్రీవరదరాజ పెరుమాళ్ దేవస్థానాలను దర్శించుకోవచ్చు. అక్కడ ప్రత్యేక పూజలు చేయవచ్చు. అనంతరం అక్కడి నుంచి మహాబలిపురానికి బయలుదేరి వెళ్తుంది ఈ ఎక్స్ ప్రెస్. అక్కడి ఆలయం, శ్రీకృష్ణ బటర్ బాల్ రాయిని దర్శించుకోవచ్చు. అక్కడి నుంచి రామేశ్వరానికి వెళ్తుంది. అక్కడ- రామనాథ స్వామిని యాత్రీకులు సేవించుకోవచ్చు.

ఆ తర్వాత మధురైకు చేరుకుంటుంది ఈ భారత్ గౌరవ్ ఎక్స్ ప్రెస్. అక్కడ మధుర మీనాక్షి అమ్మవారి ఆలయదర్శనం ఉంటుంది. ఆ తర్వాతి గమ్యస్థానం.. తిరుచిరాపల్లి. అక్కడ వెలిసిన శ్రీరంగనాథ స్వామివారిని యాత్రీకులు దర్శించుకోవచ్చు. ప్రత్యేక పూజల్లో పాల్గొనవచ్చు ఈ ఐఆర్సీటీసీ ఈ టూర్ ద్వారా. దీని తర్వాత నేరుగా తంజావూరుకు బయలుదేరి వెళ్తారు. అక్కడి బృహదీశ్వరాలయాన్ని దర్శిస్తారు. అనంతరం తిరువణ్ణామలైకి చేరుకుంటారు. అరుణాచలేశ్వరుడిని దర్శిస్తారు. దీంతో ఈ యాత్ర పూర్తవుతుంది. తిరువణ్ణామలై నుంచి తిరిగి విశాఖపట్నానికి చేరుకుంటుంది భారత్ గౌరవ్ ఎక్స్‌ప్రెస్.

ఈ ప్యాకేజీ కోసం ఒక్కొక్కరు చెల్లించాల్సిన ఛార్జీ మొత్తం 14,700 రూపాయలు. ఇది ఎకానమీ అంటే స్లీపర్ క్లాస్. ఇందులో పిల్లలు అంటే 5 నుంచి 11 సంవత్సరాల్లోపు వారికి 13,800 రూపాయల ఛార్జీని నిర్ధారించారు. ఇందులో స్టాండర్డ్ కేటగిరీ (3ఏసీ), కంఫర్ట్ కేటగిరీ (2ఏసీ) వంటివి ఉండవు. ఈ ప్యాకేజీలో రైలు టికెట్లు, రోడ్డు రవాణా, హోటల్ వసతి, భోజనం, ఇన్సూరెన్స్ వంటివి ఉంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+