విశాఖ, విజయవాడ మెట్రో పై కేంద్రం తాజా నిర్ణయం - కొత్త రూట్, డీపీఆర్..!!

ఏపీ కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. ఈ రెం ప్రాజెక్టుల డీపీఆర్ లను కేంద్రం ఆర్దిక మదింపుకు పంపింది. రెండు ప్రాజెక్టుల్లో భాగంగా 84.63 కిలో మీటర్ల మేర మెట్రో నెట్ వర్క్ ఏర్పాటు దిశగా కసరత్తు కొన సాగుతోంది. ఇందు కోసం రూ 21,616 కోట్ల పెట్టుబడి అవసరమని తేల్చారు. అందులో భాగంగా రెండు నగరాల్లో మెట్రో ప్రాజెక్టు కారిడార్ - రూట్స్ దాదాపు ఖరారు చేసారు.

ఏపీలోని రెండు ప్రధాన నగరాలు విశాఖ, విజయవాడ మెట్రో దిశగా కీలక పరిణామాలు చోటు చేసు కొంటున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్య విధానంలో చెరో 20 శాతం నిధులు సమకూర్చనుండగా, మిగిలిన 60 శాతం నిధులను ఆర్థిక సంస్థలు, విదేశీ బ్యాంకుల రుణాల ద్వారా సేకరించేలా కసరత్తు కొనసాగుతోంది. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు.. అదే విధంగా విజయవాడలో గన్నవరం నుంచి కారిడార్‌ ఏర్పాటుతో విమానాశ్రయం మీదుగా నగరంలోని ప్రధాన ప్రాంతాలకు ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్దం చేసారు. కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలతో పాటుగా ఈ ప్రాజెక్టులకు కొన్ని విదేశీ బ్యాంకులు రుణం సమకూర్చేందుకు ముందుకు వస్తున్నాయి. మెట్రో రైల్‌ ప్రాజెక్టు వ్యయంలో 40 శాతం వరకు టెండరింగ్‌ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం మెట్రో రైల్‌ కార్పొరేషన్‌కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది.

 TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
TTD గోల్డెన్ ఛాన్స్, ఒకే రోజు ఒకే టికెట్‌తో రెండు సార్లు శ్రీవారి ప్రత్యేక దర్శనం- ఇలా చేయండి..!!
central-govt-moves-visakhapatnam-vijayawada-metro-projects-forward-for-financial-appraisal-details

రెండు నగరాల్లో ప్రతిపాదిత రూట్లు

ప్రస్తుతం కేంద్రం అధ్యయనం చేస్తున్న డీపీఆర్ లకు ఆమోదం కోసం వేచి చూస్తున్నారు. విజయవాడలో ఇప్పటికే సోషల్ ఇంపాక్ట్ అసెస్ మెంట్ సర్వే మొదలు పెట్టారు. బందరు రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. రెండు కారిడార్ల మెట్రో రైల్‌ ప్రాజెక్టుకు 80 ఎకరాల వరకు అవసరమని తేల్చారు. ఇక.. విశాఖపట్నం లో తొలి దశలో భాగంగా 46.23 కిలో మీటర్ల మేర మెట్రో నిర్మాణం పై ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. స్టీల్‌ప్లాంట్‌-కొమ్మాది, గురుద్వార-పాత పోస్టాఫీస్, తాటిచెట్లపాలెం-చినవాల్తేరు కారిడార్లు గా రూ 11,498 కోట్లు అంచనా వ్యయంగా తేల్చారు. అదే విధంగా విజయవాడ లో తొలి దశ 38.40 కిమీ మేర విస్తరించనుంది. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌-గన్నవరం, పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌-పెనమలూరు కారిడార్లుగా ప్రణాళికలు సిద్దం చేసారు. ఇందు కోసం రూ.10,118 కోట్లు అంచనా వ్యయం గా పేర్కొంటున్నారు. తాజాగా కేంద్రం చేస్తున్న కసరత్తు కొలిక్కి వస్తే రెండు నగరాల్లో తొలి దశ పనుల ప్రారంభం పైన అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+