HYD లోని బ్యాచిలర్స్ కు గుడ్ న్యూస్.. మీ ఏరియాలో ఎక్కడ అన్నదానం జరుగుతుందో ఇలా ఈజీగా తెలుసుకోండి..!
వినాయక చవితి వచ్చిందంటే చాలు దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ఉంటుంది. హైదరాబాద్ లో కూడా వినాయక నవ రాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. నగరంలోని ప్రతి గల్లీలో వినాయకుడిని ప్రతిష్టించి నియమ నిష్టలతో పూజలు చేస్తారు. అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో వినాయకుడి నిమజ్జనం చేస్తారు. ఇలా గణేష్ నవ రాత్రుల ఉత్సవాల్లో తొమ్మిది రోజుల పాటు రోజూ ఏదో ఒక ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఆయా ప్రాంతాలకు భక్తులు, యువకులు, మహిళలు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే రూమ్ లో వంట చేసుకోవడానికి నానా తంటాలు పడే బ్యాచిలర్స్ కు పండగలాంటి వార్త వచ్చింది. అలాగే హాస్టల్ విద్యార్థులకు కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.
అదేంటంటే..? వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఏ రోజు ఎక్కడెక్కడ అన్నదాన ప్రసాదాలు అందిస్తున్నారో తెలుసుకునేందుకు 'Annadhanam Spots'(annadhanamspots.in) అనే సరికొత్త వెబ్ సైట్ అందుబాటులోకి వచ్చింది. ఈ వెబ్ సైట్ ద్వారా మనకు దగ్గరలోని అన్నదానం కేంద్రాల లొకేషన్, సమయాలను ఉచితంగా తెలుసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా తమకు తెలిసిన అన్నదాన వివరాలను వినియోగదారులు స్వయంగా ఈ పోర్టల్ లో నమోదు చేయవచ్చు. బ్యాచిలర్స్, హాస్టల్ విద్యార్థులకు ఈ వెబ్ సైట్ ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ మేరకు ఈ పోర్టల్ ఉచితంగా సేవలు అందిస్తోంది.

మరోవైపు హైదరాబాద్ లో ఫేమస్ అయిన ఖైరతాబాద్ పంచముఖ సంకటహర మహాగణపతి వద్ద భారీగా భక్తుల రద్దీ నెలకొంది. ఈ మేరకు క్యూలైన్లు, మండపం పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సాయంత్ర వేళ రద్దీ మరింతగా పెరుగుతోంది. ఇప్పటివరకు 2 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నట్లు సమాచారం అందుతోంది. నిన్న సాయంత్రం భారీ వర్షంలోనూ అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఖైరతాబాద్ బడా గణేష్ ను దర్శించుకున్నారు. రానున్న రోజుల్లో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ మేరకు తగిన ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications
