టీడీపీ ఇచ్చిన షాక్ తో వర్మ కన్నీటి పర్యంతం..! ఆపుకోలేక ప్రెస్ మీట్ మధ్యలో..!

కాకినాడ జిల్లా పిఠాపురంలో గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో సీటు త్యాగం చేసిన వర్మ (Varma)కు సొంత పార్టీ షాకిచ్చింది. ఇవాళ ఆయన్ను పిఠాపురం టీడీపీ ఇన్ ఛార్జ్ పదవి నుంచి తప్పిస్తూ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో వర్మ షాకయ్యారు. ఇన్నాళ్లూ పిఠాపురంలో ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న ఆయన.. అధిష్టానం తాజా నిర్ణయంతో షాక్ లో మునిగిపోయారు.

పిఠాపురం వర్మకు మెగా క్యాంప్ ఘాటు కౌంటర్..! డిఫెన్స్ లోకి కూటమి ?
పిఠాపురం వర్మకు మెగా క్యాంప్ ఘాటు కౌంటర్..! డిఫెన్స్ లోకి కూటమి ?

అధిష్టానం నిర్ణయం నేపథ్యంలో ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచిన పిఠాపురం టీడీపీ కార్యకర్తలతో వర్మ భేటీ అయ్యారు. అధిష్టానం నిర్ణయంపై వారితో చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో వర్మ తన అభిప్రాయాలు చెప్పేందుకు ప్రయత్నించారు. అయితే హైకమాండ్ తీసుకున్న నిర్ణయం మాత్రం ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వలేదు. దీంతో ఉబికి వస్తున్న కన్నీళ్లతో కాసేపు మాట్లాడిన వర్మ.. ఉన్నట్లుండి లేచి వెళ్లిపోయారు.

TDP Leader Varma Breaks Down at Press Meet After Being Removed as Pithapuram Incharge
పవన్ కళ్యాణ్.. విజయ్‌ని చూసి నేర్చుకో.. సోషల్ మీడియాలో ట్రోల్స్ !!
పవన్ కళ్యాణ్.. విజయ్‌ని చూసి నేర్చుకో.. సోషల్ మీడియాలో ట్రోల్స్ !!

అంతకు ముందు ప్రెస్ మీట్లో అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వర్మ ప్రకటించారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పని చేయాలని హైకమాండ్ చెప్పిందిని, ఎప్పుడూ పార్టీ బలోపేతానికే పనిచేశాని వర్మ చెప్పుకొచ్చారు. పార్టీకి వ్యతిరేకంగా తాను పనిచేయలేదని వెల్లడించారు. పిఠాపురం కూటమిలో ఇబ్బందులు లేకుండా ఒక కమిటీని వేయమని మంత్రి నారా లోకేష్‌ని తానే కోరినట్లు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ వెల్లడించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పిఠాపురంలో పనిచేసిన వర్మ.. ఆయన్ను గెలిపించారు. అయితే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఈ సీటులో పాతుకుపోయేందుకు వర్మను పక్కనబెట్టడం ప్రారంభించారు. చివరికి సొంత పార్టీ అధిష్టానం కూడా పవన్ కోసం తమ నేత వర్మనే బలి పశువును చేయడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+