ఇండియానా పోలీస్: అమెరికాలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మన రాష్ట్రానికి చెందిన యువశాస్త్రవేత్త వావిలాల చంద్రశేఖర్(36) మృతి చెందారు. లూసియానా రాష్ట్రంలోని న్యూ ఓర్లియన్స్ పట్టణంలో ఈ ప్రమాదం జరిగింది. ఒంగోలుకు చెందిన ఆయన స్థానిక టులన్ విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థిగా ఉన్నారు. శనివారం ఉదయం సైకిల్‌పై వర్శిటీకి వెళుతున్న చంద్రశేఖర్‌ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.