రాంఛీ: జార్ఖండ్‌లోని మావోయిస్టులపై పోరు కొనసాగిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శిబుసోరెన్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని మావోయిస్టులపై సోరెన్ సర్కారు మెతకవైఖరి అవలంభిస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే నక్సల్స్ అపహరించిన బీడీవోను విడిచిపెట్టేందుకు వారి డిమాండ్ మేరకు జైలులో ఉన్న కొందరు మావోయిస్టులను విడుదల చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఇక మీదట ఇటువంటి సంఘటనలు జరగనివ్వబోమని సోరెన్ చెప్పారు. ఇక కిడ్నాప్ లకు అవకాశమివ్వబోమని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి