వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఉస్మానియాలో నక్సలైట్లు లేరు: విసి

ప్రత్యేక తెలంగాణను కోరుకుంటూ యాదయ్య అలియాస్ యాదగిరి అనే విద్యార్థి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నానికి ఒడిగట్టడం... ఉస్మానియాను మరోసారి ఆందోళనా పథంలోకి నెట్టింది. ఓయూ విద్యార్థి ఐకాస తలపెట్టిన 'అసెంబ్లీ ముట్టడి' రోజునే జరిగిన ఈ ఘటన మరింత ఉద్విగ్న పరిస్థితులకు దారితీసింది.
విద్యార్థి ఆత్మహత్యాయత్నం విషయం తెలిసిన వెంటనే ఉస్మానియా పరిసరాల్లో నిరసనలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఒక దశలో పోలీసులూ, విద్యార్ధులు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లను, భాష్ప వాయువునూ ప్రయోగించాల్సి వచ్చింది. రెచ్చిపోయిన విద్యార్థులు తార్నాక బస్‌స్టాప్‌నకు నిప్పు పెట్టారు. రాత్రి 8 గంటల వరకూ కూడా ఓయూ పరిసరాల్లో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.