హైదరాబాద్: పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం తనను తీవ్రంగా నిరాశ పరిచిందని కాంగ్రెసు సీనియర్ నేత జి వెంకటస్వామి (కాకా) అన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తెలంగాణలో తెలంగాణ అంశాన్ని పొందుపరుస్తారని తాను ఆశతో ఎదురు చూశానని, అయితే తనకు నిరాశే మిగిలిందని ఆయన అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని డిసెంబర్ 9వ తేదీ చిదంబరం ప్రకటనకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశించిన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎంతో బాధపడుతున్నారని ఆయన అన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఆయన కోరారు. అత్మహత్యలు పరిష్కారం కాదని, పోరాడి తెలంగాణను సాధించుకోవాలని ఆయన సూచించారు. శ్రీకృష్ణ కమిటీ తన పని తాను చేస్తుందని, తన లాంటి నేత వారి ముందుకు వెళ్తే అది అవమానమని ఆయన అన్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి