వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైభవంగా పెద్దింట్లమ్మ జాతర ఉత్సవాలు

By Santaram
|
Google Oneindia TeluguNews

Peddintlamma Jathara
కైకలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానానికి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తుల తాకిడి కనిపించింది. తూర్పు, పశ్చిమగోదావరి, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు జిల్లాల నుంచి సుమారు 60 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం అమ్మవారికి అష్టమావరణ కలశార్చన, సహస్రనామ కుంకుమపూజ, పుష్పాలంకరణ, ధూపసేవ, బాలభోగం, హారతి పూజలను అర్చకులు పేటేటి పరమేశ్వరరావు నిర్వహించారు. శక్తి రూపిణిగా పేరుగాంచిన పెద్దింట్లమ్మకు భక్తులు కోడి, మేక, గొర్రెలను మొక్కుబడులుగా సమర్పించుకున్నారు.

28 వరకు జరుగు ఈ జాతర మహోత్సవంలో మొదటి ఆదివారం కావడంతో వేలాది మంది భక్తులు వాహనాలు, లాంచీల ద్వారా కొల్లేటికోటకు ఉదయమే చేరుకున్నారు. ఇటీవల జరిగిన పడవ ప్రమాదాల కారణంగా ఈ ఏడాది లాంచీల ఫెర్రి పాయింట్‌ వద్ద ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటుచేశారు. సామర్థ్యానికి మించి భక్తులను బోటుల్లో అనుమతించలేదు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా గాలిగోపురం నుంచి క్యూలైన్‌ వరకు దేవస్థానం చలువ పందిళ్లను ఏర్పాటుచేసింది. కోనేరు వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా బందోబస్తు ఏర్పాటుచేశారు. దేవస్థాన ఆవరణలో మహిళలు పాలపొంగళ్లు వండి అమ్మవారికి సమర్పించారు.

జాతరకు విచ్చేసిన భక్తులకు కైకలూరుకు చెందిన పెనుమూడి నాగరాజు ప్రత్యేక ట్యాంకర్‌ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. డీఎల్‌పీవో సత్యనారాయణరాజు, కైకలూరు తహశీల్దార్‌ డి.విజయశేఖర్‌రావు పనులను పర్యవేక్షించారు. ఆలయ చైర్మన్‌ బలే చిరంజీవి, మేనేజర్‌ శింగనపల్లి శ్రీనివాసరావు, ధర్మకర్తలు తిరుపతి వెంకన్న, మల్లిఖార్జునరావు, రామారావు, పెద్దింట్లమ్మ, గుడివాడ దేవాదాయ శాఖ ఇన్‌స్పెక్టర్‌ పామర్తి సీతారామయ్య, కైకలూరు సీఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది జాతర ఏర్పాట్లను పర్యవేక్షించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X