రష్యాపై ఉక్రెయిన్ 'భారీ డ్రోన్' అటాక్: ఒక భారతీయుడు సహా మరో ముగ్గురు మృతి !!

రష్యా రాజధాని మాస్కోపై ఉక్రెయిన్ దళాలు జరిపిన భారీ డ్రోన్ దాడుల్లో ఒక భారతీయ కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రత కలిగిన ఈ ఘటనలో మరో ముగ్గురు భారతీయులకు గాయాలయ్యాయి, సకాలంలో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకు మరింత ఉధృతమవుతున్న తరుణంలో, ఉక్రెయిన్ దళాలు మాస్కో రాజధానిపై భారీస్థాయిలో డ్రోన్లతో విరుచుకుపడ్డాయి. వందల సంఖ్యలో డ్రోన్‌లను ప్రయోగించిన ఈ దాడులు మాస్కో నగరంలో తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి.

indian-and-three-more-persons-dies-in-ukraine-drone-attack-on-moscow-and-causes-casualties-also-majo

అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ భీకర దాడుల్లో మొత్తం నలుగురు పౌరులు మృతి చెందగా, వారిలో ఒకరు భారతీయ కార్మికుడిగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం అక్కడికి వెళ్ళిన ఆ యువకుడు ఈ దాడిలో మరణించడం అత్యంత విషాదకరమని వాపోతున్నారు. గాయపడిన మిగిలిన ముగ్గురు భారతీయులకు ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

ఈ ఆకస్మిక దాడి అనంతరం మాస్కోలో భయానక వాతావరణం నెలకొంది. ఈ దాడుల సమాచారం అందుకున్న వెంటనే రష్యాలోని భారత రాయబార కార్యాలయ అధికారులు వేగంగా స్పందించారు. అత్యవసరంగా ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అంచనా వేసింది, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించింది.

మాస్కో నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని ఉక్రెయిన్ ఈ దాడులకు పాల్పడిందని రష్యా అధికారులు నిన్నటిరోజున వెల్లడించారు. రాత్రిపూట దాదాపు ఐదు వందలకు పైగా డ్రోన్‌లను ఉక్రెయిన్ ప్రయోగించగా, రష్యా రక్షణ వ్యవస్థలు వాటిని చాలావరకు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. కొన్ని డ్రోన్లు మాత్రం నివాస ప్రాంతాల్లో పతమై నష్టం కలిగించాయి.

ఈ డ్రోన్ దాడుల కారణంగా మాస్కోలోని పలు నివాస భవనాలు, కీలక మౌలిక సదుపాయాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఒక ఇంటిపై డ్రోన్ పడటంతో భారీగా మంటలు చెలరేగాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక బృందాలు విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టాయి. ఒక ఆయిల్ రిఫైనరీ సమీపంలో కూడా దాడుల ప్రభావం కనిపించింది.

రష్యాలోని అతిపెద్ద విమానాశ్రయంగా పేరొందిన షెరెమెట్యెవో ప్రాంగణంలో కూడా డ్రోన్‌ల శకలాలు పడినట్లు అధికారులు ధృవీకరించారు. దాదాపు ఏడాది కాలంలో రష్యా రాజధానిపై ఉక్రెయిన్ చేసిన అతిపెద్ద డ్రోన్ దాడిగా విశ్లేషకులు ఈ ఘటనను అభివర్ణించారు. ఈ సరికొత్త పరిణామంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+