న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితిపై వేసిన శ్రీకృష్ణ కమిటీపై సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది. శ్రీకృష్ణ కమిటీ తదుపరి కార్యాచరణను నిలిపివేయాలని కోరుతూ సోమవారం ఆ పిటిషన్ దాఖలైంది. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు హోం శాఖ చేసిన ప్రయత్నం సరి కాదని పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. సట్టసభల ద్వారానే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ జరిగేలా చూడాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం డిసెంబర్ 9, 23 తేదీల్లో చేసిన ప్రకటనల తర్వాత రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ కు వాయిదా వేసింది.
ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రం ఏయే పరిస్థితిలో రాష్ట్ర విభజన చేయవచ్చునో స్పష్టం చేయాలని కోరుతూ సోమవారం ఉదయం మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలైంది. దీన్ని కూడా ఆ తర్వాత దాఖలైన పిటిషన్ పరిధిలోకి తెచ్చారు. ఆర్టికల్ 3 కింద మార్గ దర్శక సూత్రాలను రూపొందించాలని పిటిషనర్ కోరారు. ఈ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు రెండు వారాల పాటు వాయిదా వేసింది.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి