వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్ చర్చలకు రావాలి: రాష్ట్రపతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: నక్సలైట్ పార్టీలు హింసకు స్వస్తి చెప్పి చర్చలకు రావాలని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ పిలువునిచ్చారు. పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి ఆమె సోమవారం మాట్లాడారు. సీమాంధ్ర ఉగ్రవాదం, తీవ్రవాదం దేశభద్రతకు సవాల్ గా పరిణమించాయని ఆమె అన్నారు. పశ్చిమ బెంగాల్ లో మావోయిస్టుల చర్యలు ఆందోళనకు గురిచేశాయని ఆమె అన్నారు. తీవ్రవాదులను ఉక్కు పాదంతో అణచేస్తామని ఆమె చెప్పారు. పూణే దాడులు కలవర పెట్టాయని ఆమె అన్నారు. పూణే దాడుల మృతులకు సంతాపం ప్రకటించారు. రక్షణ దళాలను ఆధునీకరిస్తామని ఆమె చెప్పారు. బలగాలకు ఆధునిక ఆయుధాలు అందిస్తామని ఆమె చెప్పారు. నిఘా వ్యవస్థలను మరింత పటిష్టం చేస్తామని ఆమె అన్నారు. నిఘా వ్యవస్థ అప్రమత్తంగా ఉన్నా జమ్మూ కాశ్మీర్ లో చొరబాట్లు పెరుగుతున్నాయని, కాశ్మీర్ లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తామని ఆమె చెప్పారు. దేశ భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని ఆమె చెప్పారు. ఈశాన్య ప్రాంతాల్లో తీవ్రవాదం అణచివేతకు చర్యలు సాగుతున్నాయని ఆమె చెప్పారు. రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తామని అన్నారు.

వర్షాభావం వల్ల దేశవ్యాప్తంగా కరువు ఏర్పడిందని ఆమె చెప్పారు. వ్యవసాయం, అభివృద్ధి ద్వారా దాన్ని ఎదుర్కుంటామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆమె తెలిపారు. బహిరంగ మార్కెట్లోకి 30 లక్షల ఆహార ధాన్యాలను విడుదల చేశామని ఆమె చెప్పారు. కరువు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెడతామని హామీ ఇచ్చారు. ఆర్థిక, సామాజిక సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. తమ లక్ష్యం ఆమ్ ఆద్మీకి మేలు చేయడమేనని అన్నారు. చక్కెర, గోధుమల సరఫరాకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. అభివృద్ధి ఫలాలు అట్టడుగు వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మత ఘర్షణల బిల్లును ఈ సమావేశంలో ప్రవేశపెడతామని ఆమె చెప్పారు.

ప్రపంచమంతా అర్థిక మాంద్యం చోటు చేసుకున్న నేపథ్యంలో ఇతర దేశాల కన్నా మన దేశం సమర్థమైన చర్యలు తీసుకుందని, దాంతో ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడగలిగామని ఆమె చెప్పారు. నల్లధనం వెలికి తీతకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మాధ్యమిక విద్య అభివృద్ధికి మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టినట్లు ఆమె తెలిపారు. గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గిస్తామని ఆమె అన్నారు. పట్టణ పేదల కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్పారు. నగరాల్లోని మురికివాడల సమగ్రాభివృద్ధికి పథకం అమలు చేస్తామని అన్నారు. మైనారిటీల సంక్షేమానికి, అభివృద్ధికి రోడ్ మ్యాప్ వేస్తామని చెప్పారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని చెబుతూ దీనికి అన్ని పార్టీలు మద్దతివ్వాలని కోరారు. టెలికాం రంగంలో సర్వతో ముఖాభివృద్ధి సాధిస్తామని చెప్పారు. 20వేల సౌర విద్యుదుత్పత్తికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అక్షరాస్యత వృద్ధికి, ఉన్నత విద్య అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, విద్యారంగంలో మార్పులు తెస్తామని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X