వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో ఫిక్సింగ్ స్థాయి లేదు: రోశయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Rosaiah
విజయనగరం: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో తాను తెలంగాణకు వ్యతిరేకంగా మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడినట్లు కాంగ్రెసు తెలంగాణ నాయకుడు టి. జీవన్ రెడ్డి చేసిన ఆరోపణను ముఖ్యమంత్రి కె. రోశయ్య ఖండించారు. చంద్రబాబుతో ఫిక్సింగ్ చేసే స్థాయి తనకు లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. తాను మ్యాచ్ లు ఆడలేనని, ఫిక్సింగ్ చేయలేనని, తన వయస్సు అందుకు సహకరించదని ఆయన అన్నారు. చంద్రబాబుకు, తనకు వయస్సు తేడా చాలా ఉందని, తాము సమకాలికులం కాదని ఆయన అన్నారు.

పార్టీ నాలుగు గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలను పార్టీ నాయకులు ఒక్కోసారి బయటకు కూడా మాట్లాడేస్తుంటారని ఆయన జీవన్ రెడ్డి ఆరోపణపై అన్నారు. పార్టీలో బాధ్యత గల నాయకులే అలా మాట్లాడితే ఎలా అని ఆయన ప్రశ్నించారు. ఈ అంశాలన్నింటినీ పార్టీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆరోపణలు అర్థం లేనివని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ధరలు తగ్గు ముఖం పడుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రైతులకు 9 గంటలు విద్యుత్తు సరఫరా చేసే హామీని దశలవారీగా అమలు చేస్తామని ఆయన చెప్పారు. మంత్రివర్గ విస్తరణకు, నామినేటెడ్ పోస్టుల భార్తీకి గడువు లేదని, అవసరాన్ని బట్టి ఈ విషయాలపై నిర్ణయాలు తీసుకుంటామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. తమకు గృహ నిర్మాణం కూడా ప్రధానమేనని ఆయన చెప్పారు. ఉత్తరాంధ్రలో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ప్రజలకు వినియోగపడేలా చేస్తామని ఆయన అన్నారు. ఒరిస్సాతో ఇంజావతి సమస్యను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి పరిష్కరిస్తానని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X