అడ్డుకుంటున్నవారితోనే పేచీ: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న ఆంధ్ర పెట్టుబడిదారులు, సంపన్నులతోనే తమకు పేచీ అని, మిగతావారితో తమకు ఏ విధమైన పేచీ లేదని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం ఉండి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సంపన్నులు, పెట్టుబడిదారుల ఉత్పత్తులను బహిష్కరిస్తామని, వారి సేవలను నిరాకరిస్తామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తమది శాంతియుత ప్రతిఘటన మాత్రమేనని ఆయన అన్నారు.

దృక్పథాలు ఎలా ఉన్నా సాధారణ ప్రజలతో తమకు ఏ విధమైన వైరం లేదని, అలాగే బతకడానికి వ్యాపారాలు చేసుకుంటున్నవారితో కూడా తమకు వైరం లేదని, వారికి ఏ విధమైన ఇబ్బందులుండవని ఆయన అన్నారు. అలాగే, తాము దాడులు చేస్తామని అనడం లేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న పెట్టుబడిదారుల, సంపన్నుల ఉత్పత్తులను కొనవద్దని ప్రచారం చేస్తామని ఆయన వివరణ ఇచ్చారు. తాము శాంతియుత పద్ధతిలో ఉత్పత్తులను బహిష్కరిస్తామని అంటున్నామని, ఇది గాంధీ చూపిన శాంతియుత పోరాటమేనని ఆయన అన్నారు. అనైతికతను ఆమోదించవద్దని గాంధీ ఆనాడే చెప్పారని ఆయన అన్నారు. సమిష్టి నిర్ణయాలకు లోబడే జెఎసి తన కార్యక్రమాలు చేపడుతుందని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+