తెలంగాణ ఏర్పాటుకు బొత్సా ఓకె

రెండు రాష్ట్రాలుంటే ఇద్దరు ముఖ్యమంత్రులుండి తెలుగువారి ప్రయోజనాలు కాపాడుతారని ఆయన అన్నారు. ప్రాతినిధ్యపరంగా చూస్తే కేంద్రంలో గోవా సిఎంనూ మన సిఎంనూ ఒకే రకంగా చూస్తారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి తాను లేఖ రాస్తానని ఆయన చెప్పారు. ప్రాంతీయ అసమానతలు తలెత్తడానికి గల కారణాలు వివరిస్తానని ఆయన చెప్పారు. హైదరాబాదులో పరిశ్రమలు పెట్టినవారిలో 95 శాతం మంది సీమాంధ్రవారున్నారని, ఐదు శాతం మంది మాత్రమే తెలంగాణవారని ఆయన అన్నారు విజయనగరం జిల్లాకు చెందిన సామాన్యులు హైదరాబాదు తాము ఎందుకు రావాలని అనుకుంటున్నారని ఆయన అన్నారు. విజయవాడ రాజధాని అయితే దాని చుట్టూ ఉన్న ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications