తెలంగాణ పార్టీ పెట్టమంటున్నారు: దామోదర్

R Damodar Reddy
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొత్త పార్టీ పెట్టాలని తనపై తీవ్రమైన ఒత్తిడి ఉందని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి ఆర్ దామోదర్ రెడ్డి చెప్పారు. తనకు దేశవిదేశాల నుంచి ఫోనులు వస్తున్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియ ప్రారంభించిందని, దాన్ని తగిన విధంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత తెలంగాణకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులపై ఉందని ఆయన చెప్పారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ముందు అన్ని రాజకీయ పార్టీలకు చెందిన తెలంగాణ నాయకులు తమ వాదనను ముక్తకంఠంతో వినిపించడానికి అవసరమైన ప్రయత్నం జరగాలని, అందుకు తాను పూనుకుంటున్నానని, పార్టీలకు అతీతంగా మరోసారి తెలంగాణ నాయకులను ఏకం చేయతడానికి ప్రయత్నిస్తానని ఆయన చెప్పారు.

విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని ఆయన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరాన్ని కోరారు. తాను రాజీనామా చేసినప్పుడు చర్చలకు రావాలని పార్టీ అధిష్టానం నుంచి తనకు ఆహ్వానం వచ్చిందని, దీంతో ముత్యంరెడ్డి, మహేశ్వర రెడ్డిలతో కలిసి ఢిల్లీ వెళ్లి అధిష్టానానికి చెందిన నాయకులందరితో చర్చలు జరిపానని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ వల్ల తెలంగాణకు న్యాయం జరుగుతుందని తనకు ఆ చర్చల వల్ల అర్థమైందని, వారు తనకు ఆ నమ్మకం కలిగించారని ఆయన అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 24 గంటల పాటు శాంతి నెలకొంటే కేసులు ఎత్తేస్తామని చిదంబరం హామీ ఇచ్చారని, అటువంటి శాంతి నెలకొని ఉందని, పరిస్థితి ప్రశాంతంగా ఉందని గవర్నర్ కూడా నివేదిక ఇచ్చారని, అందువల్ల విద్యార్థులపై కేసులు ఎత్తేయాల్సిన అవసరం ఉందని, కేసు ఎత్తివేతకు మరోసారి చిదంబరాన్ని కోరుతానని ఆయన చెప్పారు. శాసనసభ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పోటీ చేయాలనుకోవడం సరి కాదని ఆయన అన్నారు. తెరాస అభ్యర్థులను ఏకగ్రీవంగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ విషయమై తాను పార్టీ నాయకత్వంతో మాట్లాడుతానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+