డిఎస్ ది విద్రోహ ప్రకటన: కోదండరామ్

Kodandaram
హైదరాబాద్: శాసనసభ ఉప ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చేసిన ప్రకటన విద్రోహపూరితమైందని తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) కన్వీనర్ కోదండరామ్ వ్యాఖ్యానించారు. డిఎస్ ప్రకటన అనైతికమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాజీనామాలు చేస్తే ఏకగ్రీవంగా తిరిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా చర్యలు తీసుకోవాలని జెఎసిలో ప్రతిపాదించింది కాంగ్రెసు పార్టీయేనని, జెఎసి నిర్ణయానికి కట్టుబడి 12 మంది శాసనసభ్యులు రాజీనామా చేశారని, ఇప్పుడు వారిపై పోటీ పెట్టాలని కాంగ్రెసు అనుకోవడం సరైన చర్య కాదని ఆయన అన్నారు. ప్రజలను విభజించడానికి కాంగ్రెసు పార్టీ కుట్ర చేస్తోందని, ఇటువంటి రాజకీయాలనే కాంగ్రెసు మొదటి నుంచీ చేస్తూ మోసం చేస్తోందని ఆయన అన్నారు. మరోసారి కాంగ్రెసు ద్రోహపూరిత మార్గం పట్టినట్లు అనిపిస్తోందని, దానివల్ల కలిగే అనర్థాలను ప్రజలకు చెప్తామని ఆయన అన్నారు.

శ్రీకృష్ణ కమిటీకి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఒకే అభిప్రాయాన్ని వెల్లడించాలని, అలా వెల్లడించేలా ప్రజలు ఆ పార్టీలపై ఒత్తిడి తేవాల్సి ఉంటుందని, అందుకు ప్రజలను తాము చైతన్యవంతులను చేస్తామని ఆయన చెప్పారు. ప్రజలను చైతన్యవంతులను చేసి ఉద్యమానికి సమాయత్తం చేయడానికి మార్చి 9వ తేదీ నుంచి తాము తెలంగాణ జిల్లాల్లో పర్యటిస్తామని, ఈ పర్యటనలు 18కల్లా పూర్తవుతాయని ఆయన చెప్పారు. 19, 20 తేదీల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేయాలని డిమాండ్ రావడానికి గల కారణాలను, అలా చేయడం వల్ల తెలంగాణకు జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామని ఆయన అన్నారు.

తెలంగాణవాదులపై, తెలంగాణ విద్యార్థులపై పెట్టిన కేసులను ఎత్తేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ విషయమై తాము రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా విజ్ఞప్తి చేశామని, అయినా ఫలితం లేకుండా పోయిందని ఆయన అన్నారు. కేసుల విషయంలో ఇతర పద్ధతుల్లో కూడా తాము పోరాడి వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+