మంత్రి బొత్సపై సమైక్యవాదుల ఆగ్రహం

Bosta Satyanarayana
విశాఖపట్నం: రాష్ట్ర విభజన మంచిదేనన్న పంచాయతీరాజ్ మంత్రి బొత్స సత్యనారాయణపై సమైక్యవాదులు మండిపడుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు శనివారం బొత్స సత్యనారాయణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బొత్స సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజారాజ్యం పార్టీ నాయకుడు గంటా శ్రీనివాస రావు బొత్స సత్యనారాయణపై తీవ్రంగా ఆగ్రహించారు. బొత్స సత్యనారాయణ సీమాంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సమైక్యాంధ్ర స్ఫూర్తిని బొత్స సత్యనారాయణ కించపరిచారని ఆయన మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. సమైక్య ఉద్యమానికి బలం ఉందని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన అన్నారు. కాగా, బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను తెలంగాణ నాయకులు స్వాగతిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+