వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసెంబ్లీని తాకిన పెట్రో సెగలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: పెట్రో ధరల పెంపు సెగలు మంగళవారం శాసనసభను తాకాయి. పెట్రో ధరల పంపుపై మంగళవారం ఉదయం శాసనసభ కార్యక్రమాలేవీ చేపట్టకుండానే 15 నిమిషాల పాటు వాయిదా పడ్డాయి. పెట్రో ధరల పెంపుపై ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి తిరస్కరించారు. అయితే ప్రతిపక్షాల సభ్యులు పెట్రో ధరలపై తక్షణ చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టారు. దాంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. సభను అడ్టుకుంటున్నారని స్పీకర్ అన్నారు.

శాంతించాల్సిందిగా స్పీకర్ చేసిన సూచనను ప్రతిపక్షాల సభ్యులు పట్టించుకోలేదు. చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. పెట్రో ధరల పెంపుతో ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందని ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పెట్రో ధరల పెంపు వల్ల ధరలు పెరగవనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. సద్గుమణగకపోవడంతో స్పీకర్ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు. అంతకు ముందు ప్రతిపక్షాల సభ్యులు వినూత్న నిరసన ద్వారా అసెంబ్లీకి చేరుకున్నారు. లోకసత్తా సభ్యుడు జయప్రకాష్ నారాయణ నడుచుకుంటూ సభకు వచ్చారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X