వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
తెలంగాణ వాదమే గెలుస్తుంది: సారయ్య

తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణ ఇవ్వాలనే ఆలోచన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఉందని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీ కూడా తెలంగాణకు అనుకూలంగానే నివేదిక సమర్పించే పరిస్థితులున్నాయని ఆయన అన్నారు. పెట్రో ధరల పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్యాస్ ధరలపై సబ్సిడీలు కొనసాగిస్తున్నందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు అభినందించాలని ఆయన అన్నారు.