హైదరాబాద్: పెట్రో ధరల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మంగళవారం ఉదయం ఎడ్లబండిపై శాసనసభకు వచ్చారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద స్వర్గీయ ఎన్టీ రామారావుకు నివాళులు అర్పించిన అనంతరం ఆయన ఎడ్లబండిపై శాసనసభకు బయలుదేరారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెట్రో ధరల పెంపును నిరసిస్తూ ఎన్టీఆర్ ఘాట్ వరకు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. వామపక్షాల నాయకులు, కార్యకర్తలు కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు.
పెట్రో ధరల పెంపును తగ్గించే వరకు ఆందోళన కొనసాగిస్తామని చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. పెట్రో ధరలు పెంచి కేంద్ర ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరిచిందని ఆయన వ్యాఖ్యానించారు. పెట్రో ధరల పెంపుపై ప్రధాని మన్మోహన్ ఇచ్చిన వివరణను ఆయన ఖండించారు. బిజెపి శాసనసభ్యుడు జి కిషన్ రెడ్డి వినూత్న నిరసన చేపట్టారు. బైక్ ను తోసుకుంటూ ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు.
Oneindia బ్రేకింగ్ న్యూస్.రోజంతా తాజా వార్తలను పొందండి