హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొత్సకు జ్ఞానం ఉందా: దేవినేని ఉమ

By Pratap
|
Google Oneindia TeluguNews

Devineni Umamaheswara Rao
హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగితే తప్పేమిటన్న రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణపై కోస్తాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వర రావు తీవ్రంగా మండిపడ్డారు. మంత్రిగా ఉండి బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేస్తున్న బొత్సకు జ్ఞానం ఉందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆశీస్సులతో, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్ అండదండలతో బొత్స చిలక పలుకులు పలుకుతున్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామానికీ ఉలిక్కిపడే వీరప్ప మొయిలీ బొత్స వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేయకపోవడం వల్ల కృష్ణా జిల్లాలో రెండు లక్షల ఎకరాల పంటలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి, మంత్రులకు తమ సమస్యలే తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన అన్నారు. బొత్స సత్యనారాయణపై తెలుగుదేశం మరో శాసనసభ్యుడు దూళిపాళ నరేంద్ర చౌదరి కూడా విరుచుకుపడ్డారు.

కాగా, తన ప్రకటనపై మంత్రి మోపిదేవి వెంకటరమణ కాస్తా వెనక్కి తగ్గారు. తాను బొత్స సత్యనారాయణను సమర్థించినట్లు వార్తల్లో నిజం లేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. బొత్స ప్రకటనను తాను సమర్థించడం గానీ వ్యతిరేకించడం గానీ చేయలేదని ఆయన వివరణ ఇచ్చారు. తన అభిప్రాయాన్ని శ్రీకృష్ణ కమిటీకి మాత్రమే చెప్తానని ఆయన అన్నారు. బొత్స తన అభిప్రాయాన్ని తాను వెల్లడించారని, దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం గానీ సమర్థించాల్సిన అవసరం గానీ లేదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X