విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసిలో చిచ్చు?

By Pratap
|
Google Oneindia TeluguNews

Andhra University
విశాఖపట్నం: రాష్ట్ర విభజన జరిగితే మంచిదేనన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్య, ఆయనకు మరో ఇద్దరు మంత్రుల మద్దతుతో సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి)లో చిచ్చు రేగింది. విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం జెఎసిలో విభేదాలు పొడసూపాయి. బొత్సకు మద్దతుగా విశ్వవిద్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రయత్నించిన కిశోర్ అనే విద్యార్థిని మిగతా నాయకులు బయటకు పంపించి వేసినట్లు తెలుస్తోంది. కాగా, తామంతా కలిసే ఉన్నామని విద్యార్థి జెఎసి నాయకులు వెంకటరమణ, మహేష్ అంటున్నారు.

తాము ఐక్యంగానే సమైక్యాంధ్రను సాధించుకుంటామని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర వెనకబడిందని, ఆంధ్రలోనూ వెనకబడిన ప్రాంతాలున్నాయని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలను కాంగ్రెసు అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్యూఐ విద్యార్థులు కొంత మంది అంటున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం మాత్రం విభజనను కోరుకుంటే మాత్రం తప్పని వారంటున్నారు. విద్యార్థుల మధ్య చిచ్చు రేగడంతో విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అదనపు పోలీసు బలగాలను విశ్వవిద్యాలయంలో దింపారు. మాటల్లో విద్యార్థులు రెండుగా చీలిపోయినప్పటికీ పూర్తిగా విభేదాలు బహిరంగం కావడం లేదని కోస్తాంధ్ర మీడియా వ్యాఖ్యానిస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X