బెంగళూరు: తెలుగు సహా దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో సెల్ ఫోన్ ద్వారా ఎస్ ఎంఎస్ లను పంపుకునే సదుపాయాన్ని పాణిని కీపాడ్ ఇప్పటికే కల్పించింది. దీనివల్ల ఇంగ్లీషు రాని పామరులు కూడా తెలుగులో మెసేజ్ లు పంపుకోడానికి అవకాశాలను కల్పించింది. ఇప్పుడు కొత్త అడ్వాన్స్ మెంట్ వచ్చింది. డేటా బేస్ లో ఉన్న పదాల ఆధారంగా కొన్ని అక్షరాలు కొట్టిన వెంటనే మీరు తరచు అన్వేషించే పదాలు ప్రత్యక్షమవుతాయి. ఎస్ ఎంఎస్ పదాలను ముందే పలికించడం గొప్ప సాంకేతిక విజయమే అని చెప్పుకోవాలి.
ఈ కీ బోర్డు 8 అంతర్జాతీయ భాషల్లో, తెలుగు సహా 8 భారతీయ భాషల్లో పనిచేస్తుందని లూనా ఎర్గొనామిక్స్ సిఇవో అభిజిత్ బట్టాచార్జీ చెప్పారు. పాణినికి రోజుకి ప్రస్తుతం 500 డౌన్ లోడ్స్ వస్తున్నాయి. ప్రాంతీయ భాషా మాధుర్యాన్ని మెసేజ్ ల ద్వారా పూర్తిగా అందించడానికి మూడు నెలల సమయం సరిపోతుందని ఆయన చెప్పారు.