ప్రమాదంతో ఆగిపోయిన ఏవియేషన్ షో

ప్రమాదం జరిగిన చోట సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు విమానాలు విన్యాసం చేస్తుండగా సూర్యకిరణ్ కూలిపోయింది. ఏవియేషన్ షో ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య కూడా పాల్గొన్నారు. నాలుగు సూర్యకిరణ్ యుద్ధ విమానాలు ఈ షోలో పాల్గొంటున్నాయి. పారాచ్యూట్ ల ద్వారా పైలట్, కోపైలట్ బయటకు రావడానికి ప్రయత్నించి ఉంటారని, ఆయితే సమయాభావం వల్ల వారి ప్రయత్నం ఫలించి ఉండకపోవచ్చునని హైదరాబాదు నగర పోలీసు కమిషనర్ ఎకె ఖాన్ మీడియా ప్రతినిధులతో చెప్పారు. పైలట్, కోపైలట్ ఇద్దరు కూడా మరణించినట్లు ఆయన ధ్రువీకరించారు.