ఇరాన్ పై అమెరికా భారీ దాడి- ఈ సారి

పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు మళ్లీ తీవ్రతరం అయ్యాయి. అమెరికా సైన్యం ఎకాఎకిన దక్షిణ ఇరాన్‌పై దాడి చేసింది. ఆత్మరక్షణలో భాగంగానే ఈ దాడులు జరిపినట్లు అమెరికా రక్షణ శాఖ పేర్కొంది. ఇరాన్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రాలు, సముద్రంలో మైన్‌లు వేసే నౌకలు లక్ష్యంగా ఈ దాడులు కొనసాగాయి. ఇది నిన్నటివరకు నిలిచిపోయిన ఇరాన్-అమెరికా యుద్ధం పునః ప్రారంభమైందనడానికి సంకేతాలుగా భావిస్తోన్నారు.

హోర్ముజ్ జలసంధికి ఆనుకొని ఉన్న బందర్ అబ్బాస్ ప్రాంతంలో దాడులు జరిగాయి. ఆ ప్రాంతం అంతా పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. బందర్ అబ్బాస్ తీరం, సముద్రం లోపల ఇరాన్ నౌకలు శక్తిమంతమైన మందుపాతరలు వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ఘటనల అనంతరం ఇరాన్ తన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను అప్రమత్తం చేసింది. ఈ దాడులు చేపట్టింది.

US Military Conduct Fresh Strikes Southern Iran Targeting Mine-Laying Boats and Missile Launch Sites

తాజా పరిణామాలు.. పశ్చిమ ఆసియాలో భద్రతను మరింత అస్థిరపరిచే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి. ఇరాన్ దీనికి ప్రతీకార దాడులకు దిగే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. ఈ దాడులపై ఇప్పటివరకు ఇరాన్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మంత్రి అబ్బాస్ అరాగ్ఛీ నుంచి కీలక ప్రకటన వెలువడొచ్చు. శాంతి ఒప్పందాలకు అమెరికా తూట్లు పొడిచిందని ఇరానియన్ మీడియా అభిప్రాయపడుతోంది.

ఇరాన్‌తో శాంతి చర్చలు కొలిక్కి రావొచ్చంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోపే తాజా దాడులు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దాదాపుగా ట్రూత్ సోషల్ లో ఆయన ఈ పోస్ట్ చేస్తున్న సమయంలోనే ఈ అమెరికా దాడులు జరగడం గమనార్హం.

ఈ దాడులపై అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ స్పందించారు. ఇరాన్ దళాల నుండి తమ సైనికులను రక్షించుకోవడానికి ఎయిర్ స్ట్రైక్స్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. కాల్పుల విరమణ అమలులో ఉన్నందున తాము సంయమనం పాటిస్తోన్నామనీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+