అధిక మాసంలో వచ్చే పవర్ ఫుల్ పౌర్ణమి- ఇలా చేయండి
హిందూ ధర్మంలో పౌర్ణమిని అత్యంత పవిత్రమైన, ప్రాముఖ్యత కలిగిన దినంగా పరిగణిస్తారు. హిందూ క్యాలెండర్ ప్రకారం అదనపు చంద్ర మాసమైన అధిక మాసంలో ఈ పౌర్ణమి వస్తుంది. ఈసారి ఇది జ్యేష్ఠ అధిక మాసంలో రాబోతోండటం ఆధ్మాత్మికంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పురుషోత్తమ మాసం అని కూడా వ్యవహరించే ఈ నెలలో వచ్చే పౌర్ణమికి, విశేష ప్రాముఖ్యత ఉంది.
ఈ అధికమాస పౌర్ణమి తిథి ఈ నెల 30న రానుంది. ఉదయం 11:57 నిమిషాలకు తిథి ప్రారంభమై మరుసటి రోజు మధ్యాహ్నం 2:14 నిమిషాలకు ముగుస్తుంది. అధిక జ్యేష్ఠ పౌర్ణమి ఉపవాసం రోజున సాయంత్రం 6:40 నిమిషాలకు చంద్రోదయమౌతుంది. ఉదయ వ్యాపిని అధిక జ్యేష్ఠ పౌర్ణమి 31వ తేదీ ఆదివారం నాడు వస్తుంది.

సనాతన ధర్మంలో పౌర్ణమికి, ముఖ్యంగా అధిక మాసంలో వచ్చే పౌర్ణమికి అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. నారాయణుడికి అంకితం చేసిన రోజు ఇది. భక్తులు ఈ రోజున సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉంటారు, కఠినమైన నియమాలు పాటిస్తారు. ఈ పవిత్ర ఉపవాస దీక్షను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా పుణ్యఫలాలు సిద్ధిస్తాయి.
దానధర్మాలు చేయడం, గంగా నదిలో లేదా ఇతర పుణ్య నదులలో పవిత్ర స్నానాలు ఆచరించడం ఈ రోజు ప్రధాన అంశంగా భావిస్తారు. అలాగే, ఇతరులకు సహాయం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయని నమ్ముతారు. భక్తులు స్వామివారి ఆశీస్సులు పొందేందుకు వివిధ ఆధ్యాత్మిక క్రతువులు నిర్వహిస్తారు. విష్ణువు పురుషోత్తమ రూపాన్ని పూజిస్తారు. ఈ రోజు ఆధ్యాత్మిక ఎదుగుదలకు అత్యంత అనుకూలమైనది.
శ్రీమహావిష్ణువు అనుగ్రహం కోసం
"ఓం నమో భగవతే వాసుదేవాయ..!!
"అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామ నారాయణం జానకి వల్లభం..!!"
"రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే..!!"
"హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే..!!" మంత్రాలను జపించాలి.












Click it and Unblock the Notifications