బొత్సపై ఆంధ్రా యూనివర్సిటీలో రచ్చ రచ్చ

Bosta Satyanarayana
విశాఖపట్నం: తెలంగాణాకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసి, తన నిర్ణయాన్ని శ్రీకృష్ణ కమిటీకి వెల్లడిస్తానన్న మంత్రి బొత్స సత్యనారాయణ తీరుపై ఏయూ విద్యార్థులు, జేఏసీ నాయకులు మండిపడ్డారు. జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఏయూ విద్యార్థులు పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి, వైఎస్సార్‌, ఎన్టీఆర్‌ వేషధారణలతో నిరసన తెలిపారు. 'తాము ఆంధ్రప్రదేశ్‌ అభ్యున్నతి కోసం కృషిచేస్తే, మీరు ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తారా అంటూ' ఆగ్రహం వ్యక్తం చేశారు.

జేఏసీ క న్వీనర్‌ ఆడారి కిషోర్‌ మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధిని గాలికి వొదిలేసిన బొత్స కు రాష్ట్ర విభజన గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. రాష్ట్రాన్ని రెండుగా చీల్చి తెలంగాణకు కేసీఆర్‌, ఆంధ్రాకు బొత్స సీఎంలు కావాలన్న స్వార్థంతో కపట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా బొత్స తన నిర్ణయం మార్చుకోవాలని, లేని పక్షంలో వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశా రు. జేఏసీ ప్రతినిధి మహేష్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఎన్టీఆర్‌, వైఎస్సార్‌ ఎంతగానో కృషి చేశారని చెప్పారు. రాజ్యాం గం ప్రకారం అందరికీ తమ భావాలను వెల్లడించే హక్కు ఉందన్నారు. బొత్స కూడా భారతీయ పౌరునిగా తనకు నచ్చిన వ్యాఖ్యలు చేసుకునే హక్కు ఉందని చెప్పారు. కానీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన వ్యక్తిగా, ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకుని వ్యాఖ్యలు చేయాలని సూచించారు.కొంత మంది ఏయూ విద్యార్థులు మంగళవారం సాయంత్రం బొత్స దిష్టి బొమ్మతో శవయాత్ర చేసి, ప్రధాన ద్వారం వద్ద దహనం చేశారు.

లేకపోతే బొత్స, ఆయన కుటుంబ సభ్యులు పదవులకు రాజీ నామా చేసి, నచ్చిన విధంగా వ్యాఖ్యలు చేసుకోవచ్చని సలహా ఇచ్చారు. జేఏసీ నేతలు మాట్లాడుతూ కొన్ని అరాచక శక్తులు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులతో కలవడం వలనే ఉద్యమం పక్కదారి పట్టిందన్నారు. ఈ పరిస్థితి ఏయూ విద్యార్థులు చేస్తున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి రాకూడదనే ఉద్దేశంతోనే తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చె ప్పారు. ఉద్యమాల కారణంగా విద్యార్థు భవిష్యత్‌ పాడవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+